మహిళా దినోత్సవం రోజే మహిళపై చేయి చేసుకున్న అశోక్ ‌గజపతి రాజు..!

Monday, March 8th, 2021, 05:48:58 PM IST

విజయనగరం జిల్లాలో మహిళా దినోత్సవం రోజునే మహిళకు అవమానం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఓ మహిళపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు చేయి చేసుకున్నారు. తమ అభిమాన నేత వచ్చారనే గౌరవంతో ఓ మహిళ అశోక్ ‌గజపతి రాజుపై పూలు చల్లింది. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే తన కంటిపై ఆ మహిళ పూలతో కొట్టిందని అశోక్‌ గజపతి రాజు ఆవేశంతో ఊగిపోయారు.

అంతేకాదు ముందుకు వెళ్తున్న అశోక్ గజపతిరాజు తిరిగి వచ్చి మరీ ఆ మహిళపై చేయి చేసుకున్నారు. అయితే వయసులో పెద్దాయన, ఎప్పుడూ సౌమ్యంగా ఉండే అశోక్‌ గజపతి రాజు ఇలా ఓ మహీళపై చేయి చేసుకోవడం అది కూడా మహిళా దినోత్సవం రోజున కావడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.