కిడ్నాప్ కేసులో ఏ2 నుండి ఏ1 గా అఖిల ప్రియ

Thursday, January 7th, 2021, 02:17:03 PM IST

వ్యాపారస్తుల కిడ్నాప్ కేసు వ్యవహారం లో అఖిల ప్రియను ఏ 2 గా భావించిన సంగతి తెలిసిందే. అయితే బోయిన పల్లి పోలీసులు ఏ 2 గా ఉన్న తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ ను ఏ 1 గా మార్పు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ 1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ 2 గా అఖిల ప్రియ, ఏ 3 గా భార్గవ్ రామ్ లు ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం మార్పు చేశారు. అయితే ఇప్పుడు ఏ 2 గా ఏవీ సుబ్బారెడ్డి నీ మార్చేశారు. వీరి తో పాటుగా శ్రీనివాస్, సాయి, చంటి, ప్రకాష్ లను నిందితులు గా చేర్చారు. అయితే బాధితుల కళ్ళకు గంతలు కట్టిన విషయంలో, కిడ్నాప్ వ్యవహారం లో పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.