వైసీపీ అధినాయకుల పై టీడీపీ ఫైర్… ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు

Tuesday, December 22nd, 2020, 04:39:11 PM IST

మరొకసారి అధికార వైసీపీ పై తెలుగు దేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీ అధినాయకుల భూ కబ్జాలు రాను రానూ మితిమీరుతున్నాయి అని తెలుగు దేశం పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములు, సామాన్య ప్రజల భూములే కాకుండా, ఆఖరికి ఆ పార్టీ కార్యకర్తల భూములను భూ కబ్జా చేయడం వలన వైసీపీ కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి దారి తీసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే గుంటూరు జిల్లా, వేమూరు నియోజక వర్గం లోని పోతు మర్రు గ్రామ భూములను వైసీపీ అధినాయకుల భూ కబ్జాలు, పోలీసుల వేదింపుల వలన వైసీపీ కార్యకర్త ఆత్మ హత్యకి పాల్పడినట్లు తెలిపింది. వైసీపీ నాయకులు మాఫియా గా తయారై ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారు అని తెలిపారు. అయితే పోలీసులు వారికి వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ టీడీపీ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే వైసీపీ కార్యకర్త ఆత్మ హత్య కి సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.