ఈ లెక్కంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో – టీడీపీ

Tuesday, August 11th, 2020, 09:45:09 PM IST

TDP_party
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యుత్తమ పాలన కొనసాగిస్తున్నారు అని వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం మాత్రమే కాక, కరోనా వైరస్ బాధితులకు అండగా ఉంటామని, అందుక గానూ కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి కి 2000 రూపాయల ను అందిస్తామని జగన్ సర్కార్ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే కరోనా నుండి కోలుకున్న వారికి 2000 రూపాయలు ఎలా అందుతున్నాయి అని టీడీపీ ఒక పోస్ట్ చేసింది. కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్ళే వారికి 2000 రూపాయలు ఇస్తున్నాం అను ప్రచారం చేసుకున్న ప్రభుత్వం, డబ్బులు ఇవ్వకుండా ఒక 2000 రూపాయలను ప్రతి డిశ్చార్జ్ సమ్మరికి జత చేసి, ఇచ్చినట్టు సాక్ష్యంగా ఫోటో తీసుకొని, ఆ తర్వాత ఉత్త డిశ్చార్జ్ సమ్మరి ను చేతికిచ్చి పొమ్మంటున్నారు అని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒక వీడియో ను సైతం జత చేసి పోస్ట్ చేయడం గమనార్హం. అయితే మరి ఈ లెక్కంతా ఎవరూ జేబుల్లోకి వెళ్తుందో అంటూ రాష్ట్ర ప్రభుత్వం కి సూటిగా ప్రశ్న విసిరింది.