ఆ దేవస్థానం ముందు నిషిద్దమైన మద్యం సీసాలు, సిగరెట్ల వాడకం

Sunday, January 17th, 2021, 07:30:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై, దేవాదాయ శాఖ పర్యవేక్షణ పై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్రం లో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది అని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే కొంతమంది సిబ్బంది కూడా దేవాలయాల ప్రశస్తి దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు అంటూ టీడీపీ చెప్పుకొచ్చింది. సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామీ వారి దేవస్థానం ముందు నిషిద్ధమైన మద్యం సీసాలు, సిగరెట్ల వాడకం ఎక్కువ అయింది అంటే అక్కడ పర్యవేక్షణ లో ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది అంటూ తెలుగు దేశం పార్టీ తెలిపింది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలి వీటిని పట్టించుకోరా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే తెలుగు దేశం పార్టీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడే పడి ఉన్న మద్యం సీసాలను చూపిస్తూ ఒక వీడియో ను సైతం పోస్ట్ చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ చేసిన ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. హిందూయిజం ను రాష్ట్ర ప్రభుత్వం నుండి కాపాడాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ చేసిన పోస్ట్ కి మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.