ఈ చెవిటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేదు

Friday, October 23rd, 2020, 11:38:00 AM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి తెలుగు దేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే అదే అంశం పై తెలుగు దేశం పార్టీ ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసింది.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవాలి అగ్గిపెట్టె ఉందా అని అడిగాట్ట వెనకటికి అంటూ సెటైర్స్ వేశారు. వర్షాలకు, వరదలకు రోడ్లన్నీ నాశనం అయి, ప్రజలు ప్రయాణించడానికి అనుకూలంగా లేవని ఈ చెవిటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పైపెచ్చు కొత్తగా పెంచుకుంటూ పోతున్న జరిమానాలు తప్ప అంటూ ఘాటు విమర్శలు చేశారు. సామాన్యుడికి కాస్త ఊరట లేదు అని తెలిపింది.

అయితే తెలుగు దేశం పార్టీ తరపున చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. టీడీపీ నేతల తీరును తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ, వరుస ప్రశ్నలు సందిస్తూనే ఉన్నారు.