ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటుగా, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ పాలనలో దూసుకు పోతున్నారు. అయితే సీఎం జగన్ పాలన పై, సర్కార్ తీరు పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. జగనన్న విద్యా కానుక పై మరొకసారి తెలుగు దేశం పార్టీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
నిన్ననే మొదలైన జగనన్న విద్యా కానుక పథకం తో అప్పుడే విద్యా విప్లవం రావడం, పేదల తలరాతలు కూడా మారిపోవడం జరిగిందట అంటూ తెలుగు దేశం పార్టీ విమర్శలు చేసింది. అయితే దీనికోసం ఓకే ఫోన్ తో రెండు వేరే వేరే ఫోటోలు తీసి నాడు- నేడు అని ప్రచారం మొదలు పెట్టారు అని తెలిపారు. కానీ మార్చ్ 2020 లో వచ్చిన ఫోన్ తోనే రెండు ఫోటోలు తీసి దొంగలు అడ్డంగా దొరికిపోయారు అని అన్నారు. అయితే ఇవి ఇటీవల విడుదల అయినా ఫోన్ ద్వారా ఫొటోలను తీసి చేస్తున్న ప్రచారం పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లు సైతం దీని పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
నిన్న మొదలైన విద్యాకానుక పథకంతో అప్పుడే విద్యా విప్లవం రావడం.. పేదల తలరాతలు కూడా మారిపోవడం జరిగిందంట. దీనికోసం ఒకే ఫోనుతో రెండు వేరే వేరే ఫోటోలు తీసి 'నాడు-నేడు' అని ప్రచారం మొదలెట్టారు. కానీ మార్చి 2020లో వచ్చిన ఫోనుతోనే రెండు ఫోటోలు తీసి దొంగలు అడ్డంగా దొరికిపోయారు. https://t.co/Ssemjt1Oxk pic.twitter.com/TqPlsjQ4X3
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) October 9, 2020