వైసీపీ లోకి చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Saturday, August 22nd, 2020, 01:55:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ పరిస్థతి మరింత దారుణంగా తయారయింది. టీడీపీ కి బలమైన నేతలు చాలామంది వైసీపీ లో చేరారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వైసీపీ చేరారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చందన రమేష్ మరియు ఆయన తనయుడు నాగేశ్వర్ లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. చందన రమేష్ కి మరియు ఆయన తనయుడి కి సీఎం జగన్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమం లో రాజమండ్రి ఎంపీ భరత్ మరియు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

ఎన్నికల అనంతరం భారీ విజయం సాధించిన వైసీపీ కి ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యే లు పరోక్షంగా జగన్ నిర్ణయాల కి మద్దతు తెలుపుతున్నారు. జన సేన పార్టీ ఎమ్మెల్యే సైతం వైసీపీ కి మద్దతు తెలుపుతూ ఉన్నారు. పలువురు కీలక నేతలు అని భావించిన వారు సైతం వైసీపీ లో కి చేరడం మనం చూస్తూనే ఉన్నాం.