ఏపీలో వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయ్.. టీడీపీ మహిళా నేత సీరియస్..!

Monday, October 12th, 2020, 07:36:15 AM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి మండిపడ్డారు. ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో వీధివీధి తిరిగిన జగన్, అధికారంలోకి వచ్చాక ప్రజలను వీధులపాలు చేశారని, వికేంద్రీకరణ అనే వికృత ఆలోచన కారణంగా 300 రోజులుగా రైతులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. అధికారం గర్వంతో ప్రతిపక్షనేతలను అడ్డుకుంటున్న జగన్, అమరావతి రైతుల ఆందోళనలను మాత్రం అడ్డుకోలేకపోయారని అన్నారు.

అయితే రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు అమలుకావడం లేదని, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత 73 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, మరి అక్కడ జరిగింది ఇన్‌సైడ్ ట్రేడింగ్, అమరావతిలో జరిగింది ఇన్‌సైడర్ ట్రేడింగో చెప్పాలని అన్నారు. రఘురామకృష్ణం రాజు తనకు, తనపార్టీకి మద్ధతుగా మాట్లాడలేదనే, ప్రభుత్వం ఆయనపైకి సీబీఐని పంపిందని అన్నారు.