వైసీపీ ఎమ్మెల్యే పై టీడీపీ సెటైర్స్

Friday, January 8th, 2021, 09:30:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 151 ఎమ్మెల్యే స్థానాలతో, 20 కి పైగా ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న పార్టీ గా నిలిచింది. అయితే రాష్ట్ర అభివృద్ది విషయం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న పథకాలు మరియు కార్యక్రమాల విషయం లో టీడీపీ ఇప్పటికి పలు విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ బోరు పంపు ను ప్రారంభించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ను తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది.

నర్సీపట్నం లో భారీ పరిశ్రమ ప్రారంభించిన ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ అంటూ తెలిపింది. అయితే దీని పై నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పై సెటైర్స్ చేస్తున్నారు.