నామినేషన్ వేయొద్దు అని ఎమ్మెల్యే బెదిరిస్తుంటే ఏమనాలి?

Wednesday, February 3rd, 2021, 07:37:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. అయితే నామినేషన్ల పర్వం కొనసాగుతునే ఉన్న నేపథ్యంలో మరొక ఘటన బయటికి వచ్చింది. నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే లోపలేయిస్తా చెప్పు మీ మావకి అంటూ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఒక యువకుడికి ఫోన్ చేసి బెదిరించడం చూస్తుంటే వైసీపీ నేతలకు పోలీసులు ఎంతగా లొంగిపోయారో తెలుస్తోంది అంటూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదిక గా ఘాటు విమర్శలు చేస్తోంది. అయితే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి ఎన్నికైన గౌరవనీయ శాసన సభ్యుడే ఇలా నామినేషన్ వేయొద్దు అని మరొకరిని బెదిరిస్తుంటే ఏమనాలి అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది.

అయితే వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కి సంబంధించిన ఆడియో క్లిప్ ను తెలుగు దేశం పార్టీ పోస్ట్ చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పై నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలువురు వరుస కామెంట్స్ చేస్తున్నారు. గతం లో కూడా ఆ ఎమ్మెల్యే చేసిన పనులను వివరిస్తూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈయనను కూడా అరెస్ట్ చేసి రిమాండ కి పంపిస్తారా అంటూ వైసీపీ ను సూటిగా ప్రశ్నించారు.