ఏపీ లో పోలీసులు లైసెన్స్ రౌడిలుగా తయారయ్యారు

Sunday, November 15th, 2020, 11:00:31 PM IST

TDP_party

మరొక్కసారి వైసీపీ ను టార్గెట్ చేస్తూ తెలుగు దేశం పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పోలీసులు లైసెన్స్ రౌడీలు గా తయారయ్యారు అంటూ టీడీపీ ఆరోపించింది. వైసీపీ నాయకులకి చెంచాలుగా మారి, వారు చెప్పిన వారిపైన చట్టాన్ని ఉల్లంఘించి మానసికంగా, భౌతికంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీసే హంతకులు గా మారారు అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాక పిడుగురాళ్ల, మాచారం మండలం, చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన బాను ఎలమంద నాయక్ ను పార్టీ మారలేదు అని, పోలీసులు వైసీపీ రౌడీలు అర్దరాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నాయక్ ను కిడ్నాప్ చేసి రక్తం కక్కేలా కొట్టికొట్టి గాయపరచడం దారుణం అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే ఈ దాడికి పాల్పడిన వైసీపీ గుండాలను మరియు పోలీసులను తక్షణమే శిక్షించి యలమంద నాయక్ కి న్యాయం చేయాలి అంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే దీని పై నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరు పై విమర్శలు చేస్తున్నారు మరి కొందరు మాత్రం గతం లో టీడీపీ కూడా అంతే అనే రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.