సీపీ నేత ఎలా బేరం పెట్టాడో చూడండి

Monday, December 21st, 2020, 04:28:32 PM IST

TDP_1706

అధికార పార్టీ వైసీపీ తీరును ఎండగడుతూ తరచూ తెలుగు దేశం పార్టీ వరుస ప్రశ్నలు వేస్తూనే ఉంది. అయితే ఇదే క్రమం లో రాష్ట్రం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ళ స్థలాల పంపిణీ విషయం లో తెలుగు దేశం పార్టీ అధికార పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. పేదలకు చంద్రబాబు కట్టించిన ఇళ్లను పంచకుండా పక్కనబెట్టి, కొత్తగా పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ అంటూ జగన్నాటకాలు ఎందుకో ఈ మాటలు వింటే అర్దం అవుతుంది అంటూ సోషల్ మీడియా వేదిక గా ఒక ఆడియో క్లిప్ ను టీడీపీ పోస్ట్ చేయడం జరిగింది.

ప్రభుత్వానికి భూమి ఇచ్చిన ఒక రైతుతో ఎకరానికి 10 – 15 లక్షల రూపాయల కమీషన్ ఇవ్వాలంటూ వైసీపీ నేత ఎలా బేరం పెట్టాడో చూడండి అంటూ టీడీపీ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఆడియో క్లిప్ లో ప్రభుత్వానికి తన భూమిని ఇస్తున్న రైతు దగ్గర కొట్టేసే కమీషన్ అని, ఇది కాకుండా ఇళ్ళ స్థలం కావాలంటే పేదలు కూడా వేలకు వేలు ఇచ్చుకోవాలి అంటూ తెలిపారు. అయితే ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట వైసీపీ నేతలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారో ప్రజలు లెక్కేసుకోవచ్చు అని తెలిపారు.