విశాఖ లో వైసీపీ భూ దందాలు పేట్రేగిపోతున్నాయి…నిదర్శనం ఇదే!

Tuesday, December 15th, 2020, 01:35:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైసీపీ అధికారం చేపట్టిన అనంతరం నుండి తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ పాలన లో అమరావతి ను రాజధాని గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమరావతీ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానుల నిర్ణయం పట్ల ముఖ్యం గా విశాఖ పరిపాలన రాజధాని నిర్ణయం పట్ల పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఈ నేపథ్యం లో వైసీపీ నేతలు చేస్తున్న చర్యల పట్ల టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా ఒక వీడియో ను పోస్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విశాఖ లో వైసీపీ దందాలు పెట్రిగిపోతున్నాయి అని అనడానికి నిదర్శనం ఇదే అంటూ టీడీపీ తెలిపింది. విశాఖ లో ఒక సామాన్యుడి పొలాన్ని అక్రమించుకొడమే కాకుండా, అతడి మీద ఎలా దౌర్జ్యాన్యానికి పాల్పడుతున్నాడో చూస్తుంటే, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నట్లు అర్దం అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.