కనీసం ప్రోటోకాల్ అనేది కూడా లేదా మంత్రి గారు – టీడీపీ

Wednesday, November 18th, 2020, 05:34:26 PM IST

TDP_1706

తెలుగు దేశం పార్టీ మరొకసారి వైసీపీ తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పార్లమెంట్ లో పోరాడి సాధించిన ఎంపీ ను పిలవకుండానే, విశాఖ పలాస మద్య రైల్వే ను వైసీపీ మంత్రి ప్రారంభించడం పట్ల విమర్శలు చేస్తోంది. ఇతరుల కష్టంతో తాము పండుగ చేసుకోవడం అంటే వైసీపీ నేతలకు ఎంత ముచ్చటో అని సోషల్ మీడియా వేదిక గా వెల్లడించారు.పలాస విశాఖపట్టణం నూతన రైలును సోమవారం నాడు వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు పచ్చ జెండాను ఊపి ప్రారంభించారు అని తెలిపారు. అయితే అది బాగానే ఉంది కానీ, అసలు పలాస విశాఖపట్టణం రైలు వచ్చేందుకు కారణం అయిన తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ను కనీసం పిలవకుండా నే రైలుని ప్రారంభించడం ఏమిటి అని ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు అని తెలిపారు.

అయితే కనీసం ప్రోటోకాల్ ప్రకారం అయినా ఎంపీ ను పిలవాలి కదా అనుకుంటున్నారు అని టీడీపీ తెలిపింది. అంతేకాక ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నెటిజన్లు సైతం వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.