ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ కొత్త నాటకం మొదలెట్టింది

Monday, January 11th, 2021, 01:03:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై అటు అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ ఒకరి పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రం లో దేవాలయాల పై, విగ్రహాల పై జరుగుతున్న దాడుల పట్ల అధికార పార్టీ పై టీడీపీ వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్ విగ్రహం చేయి ను టీడీపీ కి చెందిన వారు దాడి చేశారు అంటూ వైసీపీ కి చెందిన వారు ఆరోపించాడం తో టీడీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది.

దేవతా విగ్రహాల విద్వంసం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ కొత్త నాటకం మొదలెట్టింది అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపణలు చేసింది. తెలుగు దేశం పార్టీ వాళ్లు వైఎస్సార్ విగ్రహాల పై దాడులు చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు. అయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో వైఎస్సార్ వర్ధంతి నాటికే విగ్రహం చెయ్యి దెబ్బతిని ఉంది చూడండి అంటూ అందుకు సంబంధించిన ఫోటో ను పోస్ట్ చేశారు తెలుగు దేశం పార్టీ. అయితే వైసీపీ తీరు పట్ల టీడీపీ నేతల తో పాటుగా, టీడీపీ కి చెందిన వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.