బిగ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన టీడీపీ!

Sunday, March 28th, 2021, 04:42:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదిక గా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. మంత్రి శ్రీ రంగనాథ్ రాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందిస్తూ, వరి పండించే రైతులను సోమరి పోతులు అంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఈ కింద ఛాలెంజ్ కి సిద్ధమా అంటూ చెప్పుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటికి వచ్చి జగన్ రెడ్డిను దుక్కి దున్ని, వీసా రెడ్డి ను నారు పోసి, సజ్జల రెడ్డి ను నీరు పోసి, సుబ్బా రెడ్డి ను పైరు కోసి, పెద్ది రెడ్డి ను దాన్ని మార్కెట్ కి తీసుకెళ్ళి లాభానికీ అమ్ముకు రమ్మను అంటూ చెప్పుకొచ్చారు. అప్పుడు చెప్పండి మంత్రి గారు వరి పండించే రైతులను సోమరి పోతులనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ చేసిన సవాల్ ను వైసీపీ నేతలు స్వీకరిస్తారో లేదో చూడాలి. అయితే తెలుగు దేశం పార్టీ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా, మరొకరు టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.