వైసీపీ రౌడీ రాజ్యం అనడానికి ఇదే నిదర్శనం – టీడీపీ

Friday, March 19th, 2021, 09:40:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల జరిగిన పంచాయతీ మరియు నగర పాలక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల విషయం లో ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు దేశం పార్టీ అధికార వైసీపీ పై తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. మరొకసారి అధికార వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీ రౌడీ రాజ్యం అనడానికి ఇదే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చింది తెలుగు దేశం పార్టీ.

అయితే గతం లో తెలుగు దేశం పార్టీ కీలక నేతలు అయిన బోండా ఉమా మరియు బుద్దా వెంకన్న లు ప్రయాణిస్తున్న కారు పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తెలుగు దేశం పార్టీ నేతలు అప్పుడు వైసీపీ పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మాచర్ల లో తెలుగు దేశం పార్టీ నేతలు ప్రయాణిస్తున్న కారు పై వైసీపీ నాయకుడు తురక కిషోర్ కి మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్ అంటూ తెలుగు దేశం పార్టీ చెప్పుకొచ్చింది.అయితే అందుకు సంబంధించిన వీడియో ను మరియు పదవి ప్రమాణ స్వీకారానికి సంబందించిన వీడియో ను జత చేసి తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని పై నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.