ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీకి సేవలు – టీడీపీ

Thursday, October 8th, 2020, 06:42:41 PM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుత పరిస్థితుల పై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తుంటే, మరో పక్క వైసీపీ కి చెందిన నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక జిల్లా కలెక్టర ట్విట్టర్ ఖాతా ద్వారా వైసీపీ ఎమ్మెల్యే పేపర్ క్లిప్ విమర్శ రావడంతో తెలుగు దేశం పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని ఘాట్ గా స్పందించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఖాతా లో నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శ తాలూకు సాక్షి పేపర్ క్లిప్ ప్రత్యక్షం అయింది అని, దీని పై తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ధీటుగా స్పందించడం తో తనకేమీ తెలియదు అని, తన ట్విట్టర్ ఖాతా ను డీపీ ఆర్ ఓ చూస్తారు అని కలెక్టర్ తెలిపిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కొందరు అధికార పార్టీ లో సేవలు తరిస్తున్నారు అని ఆరోపించారు. ఇప్పుడిక పాలనాదికారులు కూడా వైసీపీ కార్యకర్తలము అని అనిపించుకోవడానికి ఆరాటపడుతున్నారు అని అన్నారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీ కి సేవలు చేయడం ఏమిటో అధికారులే ఆలోచించాలి అని అన్నారు.