సీఎం జగన్ పై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి సెటైర్స్

Wednesday, February 10th, 2021, 01:32:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత బుచ్చయ్య చౌదరి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల కి జీతాలు విషయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల సెటైర్స్ వేశారు. జీతాలు పెంచండి అని అడిగితే వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేయాలి అని, మీకు ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం అని స్పష్టంగా చెప్పాము అంటూ సీఎం జగన్ గారు సెలవిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. వాలంటరీ రిటైర్మెంట్ ఆ లేక వాలంటీర్ల ఓదార్పు యాత్ర న అంటూ సెటైర్స్ వేశారు. అన్నోస్తున్నాడు అని చెప్పండి వాలంటరీ రిటర్మెంట్ స్కీమ్ లో భాగం గా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొందరు మాత్రం వైసీపీ తీరు ను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ గటంలో చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.