వైసీపీ ఆసరా కోసం దేవుడికి ఆసరా తీసేసారు – టీడీపీ

Wednesday, December 9th, 2020, 02:14:51 PM IST

తెలుగు దేశం పార్టీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. గత సెప్టెంబర్ లో జీవో నంబర్ 733 ద్వారా రూ.14,99,00,000 ల దేవాదాయ శాఖ నిధులను ఆసరా పథకానికి మల్లించింది వైసీపీ ప్రభుత్వం అంటూ తెలుగు దేశం పార్టీ చెప్పుకొచ్చింది. పథకాలను అమలు చేయడం అంటే ఇతర శాఖలకు డబ్బులు లేకుండా చేయడం, ఇతరత్రా అభివృద్ది అనేది చేయకుండా ఉండటం అని వైసీపీ ప్రభుత్వం కొత్త నిర్వచనం చెప్తోంది అని టీడీపీ సోషల్ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది.

అయితే వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆసరా పథకం కోసం దేవుడు నిధులను మళ్ళించడం పట్ల అందుకు సంబంధించిన జీఓ ను సైతం తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.