ఏపీలో పరిపాలన గాడి తప్పింది అంటున్న టీడీపీ…ఇదే నిదర్శనం!?

Friday, November 13th, 2020, 04:08:20 PM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అధికార పార్టీ తీరు పై టీడీపీ ఎప్పటికప్పుడు వరుస ప్రశ్నలు వేస్తూనే ఉంది. అయితే మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ను సూటిగా ప్రశ్నించడం జరిగింది. పరిపాలన గాడి తప్పింది అని, అధికారులు ప్రజలకు సేవలు అందించకుండా, వైసీపీ నాయకులకు సేవలు చేసే విధంగా తయారయ్యారు అంటూ విమర్శించారు. పేద ప్రజలకు వైద్యం అందించే వైద్య శాలలో అధికారులు, డాక్టర్స్ సమయ పాలన పాటించకుండా ప్రజలను ఇక్కట్లకి గురి చేస్తున్నారు అంటూ టీడీపీ ఆరోపించింది. అందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

అయితే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు మధ్యాహ్న 12 గంటలకు కూడా రావడం లేదు అని, పట్టణం లోని పేద ప్రజలకు చుట్టు పక్కల గ్రామీణ ప్రజలకు ఏ రాగం వచ్చినా ఆ వైద్య శాలే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైద్య అధికారులు, డాక్టర్స్ మధ్యాహ్న 12 అయిన రాకపోయసరికి మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురు అవుతున్నారు అని టీడీపీ తెలిపింది. ఆళ్లగడ్డ లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సరైన వేళకు వచ్చి ప్రజలకు వైద్యం అందించి ప్రజలను కాపాడాలని జిల్లా వైద్య అధికారులను తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అని పేర్కొన్నారు.