కారులో హెల్మెట్ పెట్టుకోలేదు అని పోలీస్ శాఖ ఫైన్…తుగ్లక్ పాలన అంటూ టీడీపీ..!

Thursday, October 29th, 2020, 04:00:50 PM IST

పలు రాష్ట్రాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఈ మధ్య చాలా కఠినతరం గా మారిన సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తప్పని సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటూ పోలీసులు చెబుతూనే ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా కారులో హెల్మెట్ పెట్టుకోలేదు అని ఒక వార్త సంచలనం గా మారింది. అందుకు సంబంధించిన న్యూస్ కాస్త వైరల్ గా మారగా, తెలుగు దేశం పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తోంది.

రాష్ట్రంలో ఈ పిచ్చి తుగ్లక్ పాలన లో తుగ్లక్ గారికి, తన అధికారులకు పిచ్చి బాగా ముడిరినట్లు ఉంది అని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. మొన్న తుని పట్టణం లో రోడ్ల పై తిరిగే పశువుల పై ఫైన్ వేశారు, ఇప్పుడేమో విశాఖ పట్టణం లో కారు లో హెల్మెట్ పెట్టుకోలేదు అని పోలీస్ శాఖ నుండి ఫైన్ వేస్తూ, ఈ రసీదు ను కారు యజమానికి పంపారు అంటూ తెలపడం జరిగింది. అసలు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏమి చేయాలని అనుకుంటున్నారో అంటూ టీడీపీ విమర్శలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సైతం నెటిజన్లు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.