పథకాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు జేబులో వేసుకుంటున్నారు

Friday, October 2nd, 2020, 02:11:17 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై అధికార పార్టీ తీరు ను ఎండగడుతూ తెలుగు దేశం పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ, తనదైన ప్రశ్నలతో నిలదీస్తూ వస్తోంది. అయితే తాజాగా మరొకసారి తెలుగు దేశం పార్టీ అధికార పార్టీ తీరును తప్పు బడుతూ పలు సంచలన ఆరోపణలను చేసింది.

పేదల పథకాల కోసం అంటూ పెట్రోల్ ధరలు, కరెంట్ ఛార్జీలు, పన్నులు పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల అప్పు భారాన్ని ప్రజల పై ప్రభుత్వం వేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు ఇదే పథకాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు జేబులో వేసుకుంటున్నారు అని ఆరోపించడం జరిగింది. అంతేకాక పేదలకు ఇళ్ల స్థలాల పథకమే ఇందుకు ఉదాహరణ అంటూ పేర్కొనడం జరిగింది. వేల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన వైసీపీ నేతలు జేబుల్లోకి అవినీతి సంపాదన అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పథకాల పేరుతో అయిదు నెలల్లో రూ.47,130 కోట్ల అప్పు అదే పథకాల పేరుతో వందల కోట్లు నొక్కేస్తూ ఉన్న వైసీపీ నేతలు అని పేర్కొంది.