ఇది వైసీపీ ఫ్యూడలిజానికి, పెత్తందారీ పోకడలకు నిదర్శనం

Tuesday, September 29th, 2020, 03:00:21 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ పై తెలుగు దేశం పార్టీ వరుస విమర్శలు కొనసాగిస్తూనే ఉంది. మరొకసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ను టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ గారు అందించిన అవకాశాలను అందిపుచ్చుకున్న దళితులు, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని కష్టపడి డాక్టర్లు, జడ్జిలు అయినా వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి వారి పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అంటూ దళితులను కించపరుస్తూ సంబోధించడం అమానుషం అంటూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఫ్యూడలి జానకి, పెత్తందారీ పోకడలకు నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేయడం జరిగింది. అయితే తెలుగు దేశం పార్టీ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతం లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వైసీపీ తీరును విమర్శిస్తున్నారు.