ఈ దాడులు యాదృచ్ఛికం కాదని అనుమానిస్తోంది జాతీయ మీడియా

Thursday, September 24th, 2020, 03:00:14 AM IST

TDP_1706
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై రాష్ట్ర మీడియా తో పాటుగా, జాతీయ మీడియా సైతం గమనిస్తూనే ఉంది అని తెలుగు దేశం పార్టీ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయం లో ఇంతవరకు ఒక్క నేరస్తుడుని కూడా ప్రభుత్వం పట్టుకొక పోగా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి అంటూ తెలుగు దేశం పార్టీ తెలిపింది.

అయితే ఈ దాడులు యాదృచ్ఛికం కాదని జాతీయ మీడియా అనుమానిస్తోంది అని తెలుగు దేశం పార్టీ తెలిపింది. అయితే అందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం జత చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీని పై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ రాజీనామా చేయాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై కొద్ది రోజులుగా రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయిలో రావడం పట్ల ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.