డబ్బాలు కొట్టడం తప్ప, ప్రభుత్వం చేసిందేమీ లేదు – టీడీపీ

Thursday, September 17th, 2020, 03:00:57 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై మరొకసారి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తోంది. జగనన్న సన్నిధి, రైతులకు పెన్నిధి అంటూ డబ్బాలు కొట్టడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమి లేదు అని తెలుగు దేశం పార్టీ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు అని, 15000 రూపాయలు ఇచ్చి ధాన్యం మేమే కొంటామన్నారు,తీర చూస్తే మొహం చాటేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పుడు ధర కాస్త 7 వేల రూపాయలకు పడిపోయి రైతులు తీవ్ర నిరాశలో కూరుకు పోయారు అంటూ తెలిపింది. అయితే లేని భరోసా ఇవ్వడం లో జగన్ ప్రభుత్వం పి హెచ్ డి చేసింది అంటూ రైతులు విమర్శస్తున్నారని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం పోస్ట్ చేయడం జరిగింది.