ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం

Tuesday, August 25th, 2020, 03:00:49 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకి భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అదే తరహాలో పదుల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై తెలుగు దేశం పార్టీ ఘాటు విమర్శలు చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి ఎటువంటి చర్యలు సరిగ్గా తీసుకోవడం లేదని ఇప్పటికే పము విమర్శలు చేయగా, తాజాగా మరొక వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, ప్రభుత్వం వైఖరి ను ఎండగట్టే ప్రయత్నం చేసింది.

అయితే ప్రాణాలు కాపాడే వినాయక పూజకు పర్మిషన్ నై, అని ప్రాణాలు తీసే వైన్ షాపులకు పర్మిషన్ హై అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. అంతేకాక తమకు ఆదాయమే ముఖ్యమని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వం అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మూడు వేలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రాణాలను కోల్పోయారు. ప్రభుత్వం తీరు పట్ల టీడీపీ నేతలు ఇలా ప్రశ్నిస్తూ, విమర్శలు చేస్తున్నారు.