సీఎం జగన్ పై మరోమారు టీడీపీ సంచలన వ్యాఖ్యలు

Wednesday, November 4th, 2020, 02:05:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక చేస్తున్న పనుల పై గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా ను కేసుల కోసం తాకట్టు పెట్టాడు అని, కక్ష పూరిత విధానాలు, కమిష న్లు, జే టాక్స్ లు చూసి ఒక్క కంపనీ కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావడం లేదు అని, రాష్ట్ర యువత భవిష్యత్ ను అంధకారం లోకి నెట్టి వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే టీడీపీ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఉండగా చేసిన పనులను ఒకరు వివరిస్తుందగా, మరో కొందరు మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు మాత్రమే కాకుండా,వీదుల్లో చిరు వ్యాపారులకు సీఎం జగన్ అన్న తోడు అంటూ ఉన్న పోస్టర్ లను పోస్ట్ చేస్తున్నారు.