దిశ బిల్లు పై జగన్ రెడ్డి డ్రామాలు – టీడీపీ

Thursday, March 11th, 2021, 07:15:59 PM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తరచూ విమర్శలు గుప్పించే తెలుగు దేశం పార్టీ మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలు కి, పిల్లలకి భద్రత విషయం లో ఏర్పాటు చేసిన దిశ చట్టం పై టీడీపీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దిశ బిల్లు పై జగన్ రెడ్డి డ్రామాలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే దిశ బిల్లు కేంద్రానికి రాలేదు అని, ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉందని కేంద్రం ప్రకటించినట్లు తెలుగు దేశం పార్టీ పేర్కొంది. అయితే దిశ చట్టం ఆధారం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు చోట్ల మహిళలు రక్షింప బడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇతర ప్రభుత్వాలు సైతం ప్రశంసల వర్షం కురిపించిన సంగతి అందరికీ తెలిసిందే.