బిగ్ న్యూస్: సీఎం జగన్ ను కాపీ పేస్ట్ రెడ్డి అంటున్న టీడీపీ…కారణం ఇదే!

Wednesday, November 25th, 2020, 01:00:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నారు. అటు దిశ చట్టం తో మహిళలకు న్యాయం జరుగతుండగా, ఆటో లలో, ట్యాక్సీ లలో ప్రయాణం చేసే మహిళల భద్రత కోసం అభయం అనే యాప్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీని పై తెలుగు దేశం పార్టీ ఒక వీడియో ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది.

గత టీడీపీ ప్రభుత్వం మహిళలకి సురక్షిత ప్రయాణానికి అనుకూలం గా సురక్ష ఆటో లను ప్రారంభించి, అభయ యాప్ ను గతం లో ప్రారంభించారు. అయితే మహిళలకి ఆందోళన లేని ప్రయాణం ఈ ఆటోలతో సాధ్యం కానుంది అని గత ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్రంలో ఆటో లు గానీ, ట్యాక్సీ లలో గానీ, ప్రయాణించే పిల్లలు, అక్క చెల్లెమ్మలు నిర్భయం గా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయం లో వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకునేందుకు అభయం యాప్ ను ఆవిష్కరించారు సీఎం జగన్. అయితే గత ప్రభుత్వ ఆలోచన, యాప్ ను కాపీ ను కొట్టింది అంటూ టీడీపీ చెప్పుకొస్తోంది.

అయితే తెలుగు దేశం పార్టీ పోస్ట్ చేసిన ఈ వీడియో కి పెద్ద స్థాయిలో నెటిజన్లు స్పందిస్తున్నారు. టీడీపీ ను వైసీపీ కాపీ కొడుతుంది అని, కాపీ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.