జగన్ గారూ…ఇప్పటికైనా నిద్ర లేవండి

Friday, September 4th, 2020, 03:00:42 AM IST

YS_Jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి రోజు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా వైఫల్యం చెందింది అంటూ తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా మరొకసారి తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పలు ఘాటు విమర్శలు చేస్తోంది.

ఆగస్ట్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ కరోనా తో అల్లాడింది అని తెలిపారు. ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసులలో గానీ, మరణలలో కానీ దాదాపు సగం ఈ ఒక్క ఆగస్ట్ నెలలో నే నమోదు అయ్యాయి అని తెలిపారు. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు అని, జగన్ గారు ఇప్పటికైనా మెలుకొక పోతే రానున్న రోజులు మరింత భీభత్సం గా ఉంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే పలు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తుండగా, మరి వీటి పై ఎలా స్పందిస్తారో చూడాలి.