బిగ్ న్యూస్ : జగన్ మాట తప్పాడు..మడమ తిప్పాడు.!

Sunday, May 31st, 2020, 12:35:01 PM IST

నిన్నటితో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది కాలం పూర్తి కావడంతో సోషల్ మీడియాలో వైసీపీ అధిష్టానం ఓ ట్రెండ్ చేసారు. ఇందులో వారి విజయాల కోసం చెప్తే దానికి వ్యతిరేఖంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధిష్టానం కూడా సోషల్ మీడియాలో అందుకు నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చెయ్యడం మొదలు పెట్టారు.

అందులో భాగంగా నారా లోకేష్ అయితే మరింత స్థాయిలో ట్వీట్లు చేస్తున్నారు. జగన్ మాట తప్పాడు మడమ తిప్పాడు అంటూ ఆయా అంశాల్లో జగన్ చూపించిన వేరియేషన్లను పోస్టుల రూపంలో వేస్తూ సంచలనం రేపారు. అదే ఈరోజుకు కూడా కొనసాగిస్తున్నారు. మధ్య పాన నిషేధం నుంచి పెట్రోలు ధరలు కరెంటు బిల్లుల వరకు జగన్ మాట తప్పాడు మడమ తిప్పాడు అంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు.