తెలుగుదేశానికే ప్రజల ఆదరణ అని రుజువైంది – టీడీపీ

Monday, February 22nd, 2021, 12:24:22 PM IST

TDP_1706

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హవా కొనసాగింది. అయితే ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పంచాయతి ఎన్నికల్లో తెలుగు దేశం బలపరిచిన అభ్యర్థులనే ప్రజలు ఆదరించినట్లు రుజువైంది అని తెలుగు దేశం పార్టీ తెలిపింది. ప్రభుత్వం తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినా వైసీపీ చావు తప్పి కన్ను లోట్టపోయినట్టు గా, స్వల్ప ఆధిక్యంతో గట్టెక్క గలిగింది అని తెలిపింది. అయితే జగన్ రెడ్డి పాలన ను జనం ఛీ కొడుతున్నారు అని అనడానికి ఇదే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఫలితాలు దాచి, లైట్లు తీసేసి, చీకటి కుట్రలు ఎన్ని చేసినా, తెలుగు దేశానికే ప్రజల ఆదరణ ఉందని రుజువైంది అంటూ తెలిపింది. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ కి 1,105 స్థానాలు రాగా, వైసీపీ 1,460 స్థానాల్లో విజయం సాధించింది. అయితే వైసీపీ పట్ల ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం మొదటి నుండి విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో విజయం సాధించాలి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.