జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రవాణా శాఖలో పన్నుల పెంపు?

Saturday, September 5th, 2020, 08:30:43 AM IST

YS_Jagan

ఏపీ రవాణా శాఖలో పన్నుల పెంపు విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆదాయాన్ని పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పన్నుల పెంపుకు సిద్దమయ్యింది. అయితే పన్నుల పెంపు ద్వారా రవాణాశాఖ నుంచి అదనంగా సుమారు 400 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

అయితే టూవీలర్, ఫోర్ వీలర్ల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ రవాణాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రెండు రకాల శ్లాబుల్లో ప్రస్తుతం ఉన్న పన్ను మీద 1-3 శాతం మేర పెంపు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారని, ప్రస్తుతం 9.12 శాతంగా ఉన్న టూవీలర్, ఫోర్ వీలర్ లైఫ్ ట్యాక్స్‌ను 2010 తరువాత పెంచలేదు. అయితే టూ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల ఆదాయం, ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా సుమారు 140 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని భావిస్తున్నారు.