కేటీఆర్ పీఏ అంటూ మోసాలకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెటర్!

Tuesday, November 17th, 2020, 08:33:06 AM IST

నగరం లో మాత్రమే కాకుండా, తెలంగాణ లో ఎలాంటి నేరాలు జరుగుతున్న తెలంగాణ పోలీసులు తక్కువ సమయం లోనే నేరస్తులను పట్టుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ పీ ఏ అంటూ ప్రచారం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్తుడు ను పోలీసులు పట్టుకున్నారు. అతను మాజీ రంజీ క్రికెటర్ బుడమూరు నాగరాజు గా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

అయితే నాగరాజు చేస్తున్న మోసాల గురించి టాస్క్ ఫోర్స్ డీసీపీ పి. రాధకిషన్ రావు వెల్లడించారు. ఈ నెల 7 వ తేదీన ఓ ఫార్మా కంపెనీకి కేటీఆర్ పీ ఏ అంటూ ఫోన్ చేశాడు అని, కాలుష్య నియంత్రణ మండలి మీ కంపెనీ ను మూసేయ్యాలని ఆదేశాలు త్వరలో జారీ చేయనుంది అని సదరు యాజమాన్యం కి ఫోన్ చేశాడు. అయితే 15 లక్ష ల రూపాయలు పంపితే సమస్యను పరిష్కరిస్తా అని తెలపడం తో, యజమాని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేట కి చెందిన బుడుగూరు నాగరాజు పై ఇలాంటి అనేక కేసులు నమోదు అయ్యాయి అని, ఫిబ్రవరి లో అరెస్ట్ అయి జైలు కి వెళ్లినట్లు తెలుస్తోంది.