S/o సత్యమూర్తి కంటే ముందే వస్తే అదిరేదట..!

Wednesday, January 13th, 2016, 01:48:19 PM IST


సన్నాఫ్ సత్యమూర్తి.. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమా. ఈ సినిమాలో కథ మొత్తం తండ్రి చుట్టూనే తిరుగుతుంది. తండ్రి మోసగాడు కాదు అని నిరూపించేందుకు కొడుకు పడిన తాపత్రయమే సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా.. హిట్ అయింది. కథను బలంగా చెప్పడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారు. అయితే, ఇప్పుడు తండ్రి చుట్టూ తిరిగే కథ తరహాలోనే వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో కథ సైతం తండ్రి చుట్టూరే తిరుగుతుంది.

తండ్రిని మోసం చేసి పైకి వచ్చిన విలన్ బిజినెస్ ను దెబ్బతీసి..తన తండ్రి రోడ్డుమీదకు వచ్చిన విధంగానే విలన్ కూడా రోడ్డుమీదకు రావాలి. ఇది తండ్రి కోరిక. ఆ తండ్రి కోరినను కొడుగ్గా ఎలా నెరవేర్చాడు..? విలన్ తో ఎలా డీ కొన్నాడు.. అన్నదే నాన్నకు ప్రేమతో సినిమా. ఇంచుమించు సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో సినిమా కథలు ఒకే జానర్ లో ఉన్నాయని చెప్పొచ్చు. పైగా నాన్నకు ప్రేమతో సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా తక్కువ. ఎన్టీఆర్ అంటే భారీ యాక్షన్ కోరుకుంటాం. అవేమి ఇందులో లేకపోవడంతో.. జూనియర్ అభిమానులు నిరాశకు గురయ్యారు అని చెప్పొచ్చు. ఇకపోతే, ఈ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి కి ముందు వచ్చిఉంటే హిట్ అయ్యేదని.. అసలు ఈ సమయంలో రావాల్సిన సినిమా కాదని కొందరి అభిప్రాయం. ఏదైతేనేం.. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా అభిమానులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలం అయిందని చెప్పొచ్చు.