ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదు.. తేల్చి చెప్పిన స్పీకర్ తమ్మినేని..!

Tuesday, January 12th, 2021, 06:04:47 PM IST

రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరగబోతుందని, ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ సరైన నిర్ణయం కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన రాజకీయ క్రీడా జరుగుతోందని ఇది బాధాకరమని తమ్మినేని అన్నారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వ్యవస్థను దేశాన్ని కాపాడాలి కాని సంక్షోభం సృష్టించకూడదని తమ్మినేని చెప్పుకొచ్చారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం కుదరదని చెప్పినా, ఎన్నికల కమీషన్ నియంతలా ఎన్నికలు జరిపించాలని అనడం వెనుక అర్ధమేమిటని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తమ్మినేని స్పష్టం చేశారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా ఏ ప్రభుత్వం అయినా గౌరవించి తీరాలని అన్నారు. నియంత్రత్వ ధోరణితో వెళ్ళినందుకే న్యాయ స్థానం ప్రజల పక్షాన తీర్పు చెప్పిందని అన్నారు.