చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇదేనా.. స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు..!

Friday, November 6th, 2020, 11:10:46 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కట్టిన డీడీలు టీడీపీ నేతల ఇళ్లల్లో ఉన్నాయని అన్నారు. సంక్రాతి నాటికి ఇళ్లు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకుంటామని అంటున్నారని చెప్పుకొచ్చారు. 40 ఏళ్ళు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్రంలో టీడీపీ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తుందని అన్నారు.

అయితే గత టీడీపీ హయాంలో పేదలను అనేక విధాలుగా మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల బిల్లులు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ఓ ప్రజా ప్రతినిధిగా నిర్భయంగా మాట్లాడతానని అన్నారు. ఎవరు తప్పు చేసినా తాను ప్రశ్నిస్తానని, అధికార పార్టీ తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తానని తమ్మినేని చెప్పుకొచ్చారు.