మూడు కాకపోతే రాజధానులు 30 పెట్టుకోండి – తమ్మారెడ్డి భరద్వాజ

Monday, February 24th, 2020, 12:00:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఫై ఇంకా సందిగ్దత నెలకొని ఉందని చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వ హయం లో అమరావతిని రాజధాని గా ఎంచుకున్నారు. ఐదేళ్లు పాలన తర్వాత వచ్చిన ఎన్నికలలో జగన్ భారీ మెజారిటీ తో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వ పాలనలో భారీ అవినీతి జరిగిందని, అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి, తాజాగా సిట్ కూడా ఏర్పాటు చేసింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయం ఫై తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకోండి అని విమర్శలు చేసారు. ఎక్కడి నుండి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని అన్నారు. అయితే కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన అవి రాజధానులు కావని సంచలన వ్యాఖ్యలు చేసారు. మంచికో, చెడుకో అమరావతి రాజధానికి ప్రజాధనం దాదాపు 7 వేల కోట్ల రూపాయలు పెట్టారని అన్నారు. మరో రెండు వేల కోట్ల ఖర్చు చేస్తే అమరావతి నిర్మాణం పూర్తవతుందని అన్నారు. రాజధాని ఫై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.