బాబుతో వేదిక పంచుకోవడమే ఆ నటి నేరమా?

Saturday, April 11th, 2015, 12:10:55 PM IST

lion-audio
సౌంత్ ఇండియాలో ప్రముఖ తార అయిన త్రిషపై ఇప్పుడు తమిళ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ మేరకు త్రిష భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కట్చి హెచ్చరించింది. ఇంతకీ త్రిష ఏ నేరం చేసినదని అంతగా తమిళ సంఘాల ఆగ్రహానికి గురైందని అనుకుంటున్నరా? అయితే వింనండి త్రిష చేసిన నేరమల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదికను పంచుకోవడమే.

వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన చిత్తూరు జిల్లా శేషాచలం ఎన్ కౌంటర్ లో ఆంధ్రా పోలీసుల చేతిలో తమిళనాడుకు చెందిన 20మంది కూలీలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా తమిళనాడు మొత్తం నిరసన జ్వాలలతో రగిలిపోతోంది. అలాగే ఈ ఎన్ కౌంటర్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ సర్కారే కారణమంటూ తమిళ సంఘాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇక ఈ సమయంలో ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన ‘లయన్’ ఆడియో విడుదల కావడంతో ఆ కార్యక్రమానికి చిత్ర కధానాయిక త్రిష హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావడంతో ఆయన త్రిషతో కలిసి వేదిక పంచుకున్నారు. దీనితో తమిళ సంఘాలు త్రిష చేసిన పనిని మహా ఘోరంగా పరిగణిస్తూ నిప్పులు చెరుగుతున్నాయి.