ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికైన తెలంగాణ గవర్నర్ తమిళిసై..!

Thursday, March 4th, 2021, 08:50:49 PM IST

తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలేన్స్ 2021 అవార్డుకు తమిళి సై ఎంపికయ్యారు. యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథిక్స్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ వారు అందిస్తున్న ఈ పురస్కారాలకు గాను సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందుకు తమిళిసైకి ఈ అవార్డ్ లభించింది.

అయితే అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. కాగా ఈ అవార్డులను ఈనెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ప్రధానం చేస్తారు.