నిధులు దావూద్ పంపుతున్నాడు!

Friday, November 21st, 2014, 07:31:35 PM IST


సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ 75 వ పుట్టిన రోజు వేడుకలకోసం ఆ పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా 75 అడుగుల ప్రత్యేక కేక్ ను తీసుకొస్తున్నారు. అంతేకాకుండా అంతేకాకుండా రోడ్డు కిరువైపులా ఎరుపు తెలుపు రంగులలో ఉండే బెలూన్స్ ఎగరవేస్తున్నారు… రోడ్లన్నీ బ్యానర్లతో నింపేశారు. ఈ తంతు మొత్తం సమాజ్ వాది పార్టీ ఎంపి అజంఖాన్ ఊర్లో జరుగుతుంది.

అంతేకాకుండా… ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన విక్టోరియా గుర్రపు బగ్గీలో ఊరేగింపుగా వేదికకు చేరుకుంటారు. అర్ధరాత్రి 12గంటలకు ములాయం సింగ్ యాదవ్ 75అడుగుల కేక్ ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఎంపి అజంఖాన్ తెలిపారు.

సామాజిక భావాలు కలిగిన జయప్రకాశ్ నారాయణ శిష్యుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు ఇంత ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతుండటంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత ఆర్భాటానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే… తమకు నిధులను తాలిబాన్ ల నుంచి… దావూద్ నుంచి నిధులు వస్తున్నాయని అజంఖాన్ మండిపడ్డారు.