తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోకుండా టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ చెబితే దానిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
అయితే దాసోజు శ్రవణ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ఎవడో గొట్టంగాడు గన్‌పార్క్ దగ్గరకు చర్చకు రమ్మంటే మంత్రి కేటీఆర్ వస్తారా? అని తలసాని ప్రశ్నించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి అంటూ ఉండాలని అది కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదని అన్నారు. రెండేళ్లుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.