చంద్రబాబు.. దమ్ముంటే పోటీకి రా!

Tuesday, February 10th, 2015, 12:27:59 PM IST

talasani-srinivas-yadav
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో సోమవారం తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం నుండి తాను మరలా పోటీ చేయడానికి సిద్ధమని, దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో పోటీకి రావాలని సవాల్ చేశారు. అలాగే చంద్రబాబు షో పుటప్ చేస్తున్నారని తలసాని విమర్శించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెరాసను ఇరుకున పెట్టేలా మాట్లాడాలని చంద్రబాబు సూచించారని తెలిపారు. అయితే తాను ఆ ప్రతిపాదనను మూడు సార్లు తిరస్కరించానని తలసాని వివరించారు. ఇక అంతటితో ఆగకుండా తాను సనత్ నగర్ నుండి పోటీకి సిద్ధమని దమ్ముంటే చంద్రబాబు తనపై పోటీకి రావాలని తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానించారు. కాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును కీర్తించిన తలసాని పార్టీ మారిన వెంటనే బద్ద శత్రువులా ప్రవర్తించడం చూస్తుంటే రాజకీయాలలో శాశ్వత మిత్రుత్వాలు, శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న నానుడి కరెక్టే అనిపించకమానదు.