జీహెచ్ఎంసీ ఎన్నికలకు అసలు ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఉన్నారా – తలసాని

Friday, November 6th, 2020, 01:07:20 AM IST

తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుండడంతో ఈలోపు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తయ్యారయ్యింది. అయితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా తమదే పూర్తి అధిపత్యమని టీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు.

అయితే ఓ పక్క అధికారం మాదేనని కాంగ్రెస్ చెబుతుంటే, మరోపక్క టీఆర్ఎస్‌కి తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెబుతుంది. ఇలాంటి నేపధ్యంలో ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఏ ఎన్నిక అయినా గెలుపు టీఆర్ఎస్‌దే అని, బీసీలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఉన్నారా అని తలసాని ప్రశ్నించారు.