మేము పారిపోలేదు.. భట్టికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని..!

Sunday, September 20th, 2020, 12:49:27 PM IST

Talasani_Srinivas

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి మధ్య డబుల్ బెడ్ రూం ఇళ్ళ గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీలోనే లక్ష ఇళ్లు చూపిస్తామని చెప్పి బయట నిర్మించిన వాటిని చూపిస్తున్నారని ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని భట్టి ఆరోపణలు చేశారు. అంతేకాదు లక్ష ఇళ్లు చూపించలేక పారిపోయారని అన్నారు.

అయితే దీనిపై మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో భట్టికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తాము పారిపోలేదని, లక్ష ఇండ్లను ఒకే చోట కడతారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి తీసుకెళ్లిన చరిత్ర గతంలో లేదన్నా మేము పారదర్శకంగా ఉన్నాము కాబట్టే అలా చేశామని అన్నారు. ఐదారు ప్రాంతాలు చూసి లక్ష ఇళ్లు చూపించమంటే ఎలా అని నిలదీశారు. వాస్తవాలను చూసి భట్టి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.