వర్మ – నాగ్ కాంబినేషన్ లో టబు కీ రోల్

Wednesday, November 1st, 2017, 06:36:56 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నవ మన్మధుడు ఎవరంటే అందరు నాగార్జునా అని చెప్పేస్తూ ఉంటారు. అయిదు పదుల వయసు దాటినా కూడా నాగార్జున నటనలో ఏ మాత్రం మారలేదు. ఇప్పటికి కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటారు. రీసెంట్ గా రాజు గారి గది 2 సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా కరెక్ట్ గా చెప్పలేదు. రెండు మూడు కథలను లైన్ లో పెట్టినట్లు కొన్ని మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు. నాని తో కలిసి ఒక మల్టి స్టారర్ చేస్తానని కూడా చెప్పారు.

అంతే కాకుండా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తప్పకుండా ఉంటుందని త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు. అయితే సినిమాలో టబు కూడా కనిపించబోతుందట. అప్పట్లో నిన్నే పెళ్ళాడతా – ఆవిడా మా ఆవిడే సినిమాల్లో కలిసి నాగార్జునతో కలిసి నటించిన టబు నాగ్ తన ఫెవరెట్ యాక్టర్ అని తరచు చెబుతుంటుంది. అంతే కాకుండా చాలా చ మంచి స్నేహితుడని ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాగ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుస్తానని చెబుతూ ఉంటుంది. అయితే వర్మ తెరకెక్కించబోయే ఒక యాక్షన్ థ్రిల్లర్ లో టబు కూడా కీలక పాత్ర పోషించనుందని సమాచారం.