అమెరికా దాడులను ఖండించిన సిరియా రెబల్స్

Wednesday, September 24th, 2014, 07:16:57 PM IST


ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులపై అమెరికా దాడులు చేయడాన్ని.. సిరియా రెబల్స్ ఖండించారు. గత రెండు రాత్రులనుంచి అమెరికా ఎఫ్ 16, ఎఫ్ 18, రాక్ వెల్ బాంబర్స్, డ్రోన్, క్రూయిజ్ మిస్సైల్స్ తో దాడులు చేస్తున్నది. సిరియాలోని అలెప్పో, ఆల్ హసకా, రక్వా తదితర ప్రాంతాలలో అమెరికా దాడులు చేసింది. ఈ దాడులలో 120మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. అయితే, సాధారణ ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు, భయబ్రాంతులకు గురికావలసిన అవసరం లేదని.. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, అమెరికా దాడిలో మొత్తం 16మంది సాధారణ పౌరులు మరణించారని రెబల్స్ పేర్కొన్నారు.