రైల్వే లో స్వచ్చ భారత్..!

Thursday, February 26th, 2015, 12:50:31 PM IST


ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా రైల్వే బడ్జెట్ ను ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దేశాభివృద్దిలో రైల్వేలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైల్వేలను ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నదని సురేష్ ప్రభు తెలిపారు. ఇక రైల్వేల అభివృద్దికి రాష్ట్రాల సహకారం ఎంతో అవసరం ఉంటుందని అన్నారు. ప్రయాణికుల భద్రతకు తొలిప్రాధాన్యత ఇస్తున్నట్టు సురేష్ ప్రభు ఈ సందర్భంగా తెలిపారు. రైల్వే అభివృద్ధికి భారీ నిధులు అవసరమని ఆయన అన్నారు. ఇక పాసింజర్ రైళ్ళ చార్జీలు యధాతదంగా ఉంటాయని సురేష్ ప్రభు అన్నారు. రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ళ వేగాన్ని పెంచుతామని తెలిపారు. ఇక రైళ్ళలో బయో టాయ్ లెట్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన అన్నారు. రైళ్ళలో పరిశుభ్రతకు, భద్రతకు, నాణ్యతకు పెద్ద పీఠ వేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి తెలియజేసారు.